డాక్టర్ల సమ్మె పై మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రెసిడెంట్, జూనియర్ డాక్టర్లను ఈటల విజ్ఞప్తి చేసారు. ”మొన్నటి వరకు మీ కుటుంబ సభ్యునిగా ఉన్న నేను ప్రజల తరపున మీకో విజ్ఞప్తి. కరోనా కష్ట కాలంలో మీరు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ఇలాంటి సమయంలో మీరు సమ్మె కు దిగితే పేద ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి సమ్మె విషయంలో మీరు మరోసారి పునారాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పేర్కొన్నారు
అలాగే డాక్టర్ ల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి అని ప్రభుత్వానికి డిమాండ్ చేసారు: ”వైద్యో నారాయణో హరిః అంటారు. కరోనా అది నిజం చేసి చూపించింది. అలాంటి డాక్టర్స్ , సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లు అన్నిటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. పెంచిన స్టైపెండ్ వెంటనే అందించి సమ్మె విరమింపజేయలని కోరుతున్నాను. ఆరోగ్యశాఖమంత్రి గా ఉన్నంతకాలం డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే స్పందించి వారితో చర్చలు జరపడం వల్ల పేదప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ జాగ్రత్తపడ్డామని, ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించాలి డిమాండ్ చేస్తున్నాను” అని అన్నారు.