రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లారు. ఈటల రాజేందర్ అంశం పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ చుగ్ తో ఇప్పటికే బండి మాట్లాడారు. ఇక రేపు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, ఢిల్లీ పెద్దలను ఈటల కలవనున్నారు. ఈటల రాజేందర్ చేరిక పైన బండి సంజయ్ రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్న సమయంలో అందరూ సానుకూలంగా స్పందించారు. ఇక రేపు ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వ వేధింపుల పైన,పార్టీలో చేరిక పైన చర్చించనున్నారు ఈటల. ఆ తర్వాత పార్టీ లో ఈటల చేరిక.. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.