తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించడంపై మాజీ మంత్రి ఈటల స్పదించారు. గత మూడు రోజులుగా పథకం ప్రకారం వేల ఎకరాల భూమి ఈటల కబ్జా పెట్టారని…వేల కోట్ల డబ్బులు సంపాదించాడని ప్రచారం చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ కబ్జాలు చేశాడని… ప్రజలు అసహించుకునేలా ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. 2002లో మెదక్ జిల్లా పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడనై మధుసూదనాచారి ఆధ్వర్యంలో పార్టీలో చేరానాని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు టీఆర్ఎస్ లో పని…
ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుండి తొలగించారు. ఈ మేరకు గవర్నర్ కు లేఖ పంపింది సీఎం కార్యాలయం. దాంతో ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపింది గవర్నర్ కార్యాలయం. చివరి నిమిషం వరకు ఈటల రాజీనామా చేయలేదు. అయితే ఈటల పై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఈరోజే కలెక్టర్ నివేదికను కూడా సమర్పించారు. ఈటల రాజేందర్ భూములను కబ్జా చేసినట్టు కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. జమున హేచరీస్ ఆధీనంలో భూములు…
మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చేశారు. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి. అక్రమాలకు పాల్పడిన ఈటెలను వెంటనే అరెస్ట్ చేయాలి. 155 ఎకరాల భూమిని…
ఈటల పేరు ముఖ్యమంత్రి గా టిఆర్ఎస్ లో తెర మీదకు రావడం జరిగింది అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అడ్డంకిగా ఈటల మారారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడనికి గండి పడ్డట్లు అయింది. అందుకే మెదక్ జిల్లా లో భూ కుంభకోణంలో ఈటల పెరు తెర మీద కు వచ్చింది. అసైన్డ్ భూములు కొనడానికి అమ్మడానికి వీలు ఉండదు. పట్టభూముల పక్కకి అసైన్డ్ భూములు ఉంటే అసైన్డ్…
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఈటల దగ్గర ఉన్న వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ తమిళిసై… దీంతో.. ఏ శాఖలేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.. అయితే, ఈటల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ తప్పించాలని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ లేఖ రావడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గవర్నర్.. ఇక, ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. విచారణకు ఆదేశించిన సంగతి…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. మొదట కరోనా కట్టడిపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు, వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంపై స్పందించిన వీహెచ్.. మంత్రి ఈటల మీద భూ ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.. కానీ, ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ ఆగడం లేదు.. ఈ పరిస్థితిలో…
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలపై విచారణ మొదలైంది. అచ్చంపేట ప్రభుత్వ…
తనకు ఆత్మగౌరవం కంటే పదవి గొప్పకాదు అని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్.. ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా.. విచారణకు సైతం ఆదేశించారు సీఎం కేసీఆర్.. అయితే, ఈ పరిణామాల తర్వాత వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనని ప్రకటించారు.. భూ కబ్జా ఆరోపణలు కట్టుకథలుగా కొట్టిపారేసిన ఆయన.. 20 ఏళ్లుగా ఈటల అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు..…
ఆయనో బీసీ మంత్రి…. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే.. వారి అసైన్డ్ భూములపై కన్నేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు.. నాయానో భయానో భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డుగోలుగా వాడుకున్నాడు. మంత్రి దర్పాన్ని.. భూములు కాజేసేందుకు పేదలను భయపెట్టేందుకు వాడుకున్నాడు. కోళ్ల ఫామ్ల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు. అతనే తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్. ఆయన భార్య జమున పేరుతో హ్యాచరీస్ వ్యాపారం…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ. రెండు రోజుల క్రితం కేంద్రం అడిగిన దాని కన్నా ఎక్కువ ఆక్సిజన్ మంజూరు చేసిందన్న ఆయన నిన్న మాట మార్చడం ఆయన మతి భ్రమించిందా అన్న సందేహాలకు తావిస్తోంది. లేక సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో ఈటల రాజేందర్ కు పదవీ గండం ఉందని వస్తోన్న…