టీఆర్ఎస్ సమావేశంలో ఈటలకు అనుకూల నినాదాలు, ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీలో ఈటల అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి… ఇవాళ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.. అయితే, ఈ సమావేశంలో జై ఈటెల నినాదాలను హోరెత్తించారు కొందరు కార్యకర్తలు.. మండల స్థాయి టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ వ్యక్తులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించడంతో.. ఈటల వర్గీయుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది.. నిన్నటి వరకు ఈటల వెంట ఉండి.. ఇప్పుడు ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటని కొందరు కార్యకర్తలు మండిపడ్డారు.. దీంతో.. టీఆర్ఎస్, ఈటల వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నచ్చ చెప్పేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించినా.. ఈటల వర్గీయులు.. జై ఈటల నినాదాలతో స్వరం పెంచడంతో.. వారినీ పోలీసులు బయటకు తీసుకెళ్లారు.. దీంతో.. గొడవ ముగిసిపోయింది.
Also Read
తాజావార్తలు
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
-
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!