అందుకే హుజురాబాద్‌లో దళిత బంధు ప్రారంభించాం : వినోద్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసమో ఎన్నికల కోసమో పథకాలు తీసుకువచ్చే పార్టీ కాదని, మా మేనిఫెస్టోలో లేని రైతుబంధు ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.
కేంద్ర బలగాలను దించి భయపెట్టాలని చూస్తున్నది బీజేపీయే అని ఆరోపించారు వినోద్… హుజురాబాద్‌లోనే ఆనాడు రైతు బంధు ప్రారంభించాము, అందుకే దళిత బంధు కూడా ఇక్కడి నుండి ప్రారంభించామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ సభ కోసం వంద ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తే మోడల్ కోడ్ కారణాలు చూపిస్తూ జిల్లా మొత్తం ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చారన్నారు. పక్క జిల్లా లో సభ ఏర్పాటు చేద్దాం అంటే మళ్లీ రాష్ట్రం మొత్తం కోడ్ తీసుకు వస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ బహిరంగ సభ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి గొడవలు జరగకుండా ప్రచారాలు జరిగాయని, ఇక ముందు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!