కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామి ఇచ్చారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ఆపరేటర్స్‌కు రూ.10లక్షల రుణాలు బ్యాంకుల ద్వారా అందింస్తామని తెలిపారు. మేడారం జాతరను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కిషన్‌రెడ్డి, మేడారం జాతర గురించి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రచారం చేస్తామన్నారు.
అంతేకాకుండా తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, అభివృద్ధి అడ్డుగా ఉన్న కేసీఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. హుజురాబాద్‌లోనూ దుబ్బాక, హైదరాబాద్ ఫలితాలే వస్తాయని జోస్యం చెప్పారు. గ్రామస్థాయి వరకు కేంద్రం చేసిన అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.