హుజురాబాద్‌లో హత్యా రాజకీయాలు వర్కవుట్ అవుతాయా? ఉపఎన్నికను చావో రేవోగా భావిస్తూ.. తాజాగా చేసిన కామెంట్స్ ఈటలకు కలిసి వస్తాయా? ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలతో ఈటలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? హుజురాబాద్‌లో మారుతున్న వ్యూహాలు ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా…
కరీంనగర్ జిల్లా : బిజేపి నేత ఈటెల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను అరిపోయే దీపం కాదని….తనను దించిన తర్వాత కేసీఆర్ కు తెలిసిందని తెలిపారు. తాను ఒక్కడినే మేధావిని, ఎదైన చేయ గలననే అహంకారం కేసీఆర్ కు ఉంటుందని ఫైర్ అయ్యారు. 2023లో బీజేపీ పార్టీ జెండా ఎగురబోతుందని.. కేసీఆర్ అహంకారం, డబ్బు, అధికారం మీద దెబ్బ కొట్టె ఎన్నిక ఇది అని మండిపడ్డారు. ప్రతి రెండు సంవత్సరాల ఒక సారి ఎన్నికలు…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఈటెల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇళ్ళంతకుంట నాయకుల కోసం 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని..భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కెసిఆర్ డబ్బుని నమ్ముకున్నాడని… స్కూల్ ను… బార్ గా మార్చి కమలపూర్ వాళ్ళందరిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట తీసుకు పోయి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారని… దళిత బంధు హుజురాబాద్ ఎన్నిక కోసమేనన్నారు. ప్రాణం వుండగానే తనను బొంద బెట్టాలని చూసిన… కెసిఆర్ కి మళ్లీ…
హుజురాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. టిఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గీయులగా గొడవలు చోటు చేసుకున్నాయి. కమలాపూర్ మండలం గోపాలపూర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు ఈటల అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గోపాల్ పూర్ గ్రామంలో కరెంట్ పోల్స్ కు కట్టిన బిజెపి జెండాలను తొలిగించి… టిఆర్‌ఎస్ జెండాలు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. read also : నేటి నుంచి ఏపీలో…
కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి… ఈటల జమునకు కౌంటర్ ఇచ్చారు. ఈటల జమున బౌన్సలర్లను వెంట పెట్టుకొని గడియారాలు పంపిణీ చేస్తుందని… ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు టీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు టీఆరెఎస్ పార్టీ, కేసీఆర్ కు అండగా ఉంటారని తెలిపారు. read also : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరో వస్తారు కానీ..…
మాజీ మంత్రి ఈటలపై తొలిసారిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని.. ఈటెలకు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని నిలదీశారు. మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టారని…ఈటెల రాజేందర్ తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చిందని…టీఆరెస్ అభివృద్ధిని.. బీజేపీ ఖాతాలో ఈటెల ఎలా వేసుకుంటారు? అని ఫైర్ అయ్యారు. read also…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును వివరించనున్నారు. read also : వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే ? అయితే……
హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు రఘునందన్ రావు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ.. ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుని తయారు చేసుకోలేక పోయిందని చురకలు అంటించారు. గతంలో దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలిచినట్టు… హుజురాబాద్ మాదే అని ప్రకటనలిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం…
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్‌ఎస్ వ్యూహం మార్చిందా? ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టు ఎత్తుగడలు ఉండబోతున్నాయా? గుత్తగా గురిపెట్టడానికి ప్లాన్ సిద్ధమైందా? ఇంతకీ ఏంటా వ్యూహం? గులాబీ శిబిరం టార్గెట్ ఏంటి? హుజురాబాద్‌లో మారిన టీఆర్‌ఎస్ వ్యూహం? మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో అధికారపార్టీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. సీనియర్ నాయకులు నియోజకవర్గాన్ని జల్లెడ పట్టినట్టుగా…
జై శ్రీరాం నినాదం లేకుండా బీజేపీ నేతల ప్రసంగాలను ఊహించలేం. కాషాయ కండువా కప్పుకొనేవాళ్లు ఎవరైనా.. కొత్తలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఇలాంటి స్లోగన్స్‌కు అలవాటు పడతారు. కానీ.. ఆ మాజీ మంత్రికి ఇంకా బీజేపీ బాడీ లాంగ్వేజ్ వంటబట్టలేదట. కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ వల్లో ఏమో.. ఆయన తీరు వినూత్నంగా ఉందట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఈటల నోటివెంటరాని జైశ్రీరాం నినాదం! ఈటెల రాజేందర్. మాజీ…