ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ దుమ్మురేపుతోంది. బ్యాటింగ్‌లో ఇరగదీసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 427/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం కలుపుకుని 608 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఇక ఆట చివరి రోజు భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్నది మ్యాచ్‌లో కీలకంగా మారింది. ఐదవ రోజు ఏడు వికెట్స్ తీస్తే.. మ్యాచ్ భారత్…
Eng vs IND: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌లోనే అత్యధికంగా 269 పరుగులు చేయడం ఈ ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, 3…
ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. మొదటి రోజు బ్యాటింగ్ చేసిన భారత్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో అలరించాడు. సారథిగా ఫుల్‌టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్.. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్…
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. చివరికి ఓటమి చవిచూసిన టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి టెస్టులో భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం అందుకున్న ఇంగ్లండ్.. జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలా అనే సందిగ్ధంలో భారత్ ఉంది. ఈ…
ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మూడింటిలో మాత్రమే ఆడించాలని టీమిండియా టీమ్‌మేనేజ్‌మెంట్ ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఐదు వికెట్స్ పడగొట్టాడు. అయితే తొలి టెస్టులో భారత్ ఓటమిపాలై.. 0-1తో సిరీస్‌లో వెనుకబడింది. ఇక జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలనుంది. ఈ టెస్టులో బుమ్రా ఆడుతాడో లేదో అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై టీమిండియా అసిస్టెంట్…
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పేలవ బౌలింగ్ కారణంగా ఇంగ్లండ్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో సహా ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్స్ తీయలేకపోయాడు. సిరాజ్, ప్రసిద్, జడేజాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండవ టెస్ట్ కోసం మణికట్టు స్పిన్నర్…
సూపర్ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌లో కూడా రాణిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడని, అతడు కచ్చితంగా మరిన్ని రన్స్ సాధిస్తాడన్నాడు. రాహుల్ ఒక్క శతకంతోనే ఆగిపోడని, మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని మంజ్రేకర్ తెలిపాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో జులై…
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం యశస్వి ముందుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ 97 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు ఖాతాలో చేరనుంది. ప్రస్తుతం 20 టెస్టుల్లో (38 ఇన్నింగ్స్‌లు) 1903 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు…
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. తాను అన్ని మ్యాచ్‌లు ఆడలేనని సిరీస్‌కు ముందే బుమ్రా చెప్పగా.. అందుకు బీసీసీఐ ఒకే చెప్పింది. బీసీసీఐపై…
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన టీమిండియా కొత్త టెస్ట్…