India playing XI vs England in Lord’s Test: మరికొద్దిసేపట్లో లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియాకు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మాత్రం పెను సవాల్ తప్పదు. రెండో టెస్టులో ఓడిన ఇంగ్లండ్ పుంజుకునేందుకు అన్ని అస్రాలు సిద్ధం చేసుకుంది. భారత్ కూడా ఒకటి, రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు టెస్టుల్లో అంతగా ప్రభావం…
జూన్ 10 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మధ్యాహ్నం 3.30కి మూడో టెస్ట్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓటమి అనంతరం పుంజున్న భారత్.. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో టెస్టులో గెలిచి ఆధిక్యం సంపాదించాలని చూస్తోంది. మరోవైపు లార్డ్స్‌లో సత్తా చాటాలని ఇంగ్లండ్ బావిస్తోంది. అయితే రెండో టెస్టులో సత్తాచాటిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పలు…
ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ టీమ్స్ చెరో మ్యాచ్ గెలిచాయి. జులై 10 నుంచి లార్డ్స్‌లో మూడవ టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. మూడో టెస్టులో ఆడడం టీమిండియాకు సానుకూలాంశం. అయితే లార్డ్స్ టెస్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడేది అనుమానంగానే ఉంది. Also…
భారత పేసర్ ఆకాశ్ దీప్ సోదరి జ్యోతి సింగ్ ఎమోషనల్ అయ్యారు. నాన్న, అన్నయ్య లేనప్పటి నుంచి ఆకాశ్ అన్నీ తానై కుటుంబాన్ని నడిపిస్తున్నాడని చెప్పారు. ఇలాంటి మంచి సోదరుడు ఉండటం చాలా అరుదు అని, ఇది తన అదృష్టం అని పేర్కొన్నారు. తన కోసం భావోద్వేగానికి గురై మ్యాచ్ ప్రదర్శనను అంకితం చేశాడని జ్యోతి సింగ్‌తెలిపారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆకాశ్ దీప్ పది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ…
ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన 2వ టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. అసలు మొదటి టెస్టులో ఓడిన తర్వాత, బుమ్రా లేకుండా బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఎలా ఆడుతుందో అని అందరూ అనుకున్నారు.
ఇంగ్లండ్ గడ్డ మీద భారత జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెలరేగుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147).. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. వరుస సెంచరీలు బాదిన గిల్.. పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌పై కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అద్భుతంగా ఆడుతున్నావని, భవిష్యత్తులో…
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో 143 రన్స్ చేశాడు. 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో శతకం కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో వైభవ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. సెంచరీలతో సత్తాచాటుతున్న వైభవ్..…
Harry Brook Sledge Shubman Gill: ఐదు టెస్ట్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన గిల్ సేన.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి విజయం దిశగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 72/3 స్కోరుతో ఉండగా.. చివరి రోజైన ఆదివారం భారత్ 7 వికెట్స్ తీస్తే మ్యాచ్ సొంతమవుతుంది. ప్రస్తుతం మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే…
టెస్ట్ క్రికెట్‌లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి 1000 పరుగుల మార్కును అందుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఈ అరుదైన రికార్డు సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో 1,000 పరుగులు దాటిన ఆరో జట్టుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో మొత్తంగా భారత్ 1014 పరుగులు చేసింది. గతంలో టీమిండియా…
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దుమ్మురేపుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. గిల్ భీకర ఫామ్‌లో ఉన్న వేళ.. రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. వరుస సెంచరీలు బాదిన గిల్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.…