భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను లెజెండరీ ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌తో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పోల్చాడు. తన బంతులతో బ్యాటర్లను బురిడీ కొట్టించగల నైపుణ్యం బుమ్రాలో ఎక్కువగా ఉందన్నాడు. బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ వేస్తాడని, అందుకే అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుందన్నాడు. బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడలేడని, ఇంగ్లండ్ టీమ్ కూడా అదే కోరుకుంటోందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఓ…
తాను ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్‌గా ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ సవాల్‌తో కూడుకున్నదని, ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఓ బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గిల్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ…
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశముంది. పనిభార నిర్వహణలో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం లేదని జట్టు ఎంపిక సందర్భంలోనే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. బుమ్రా లేకున్నా భారత జట్టుపై ప్రభావం పడదని, అతడి గైర్హాజరీలోనూ రాణించే పేస్ విభాగం…
త్వరలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. తొలి టెస్ట్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీకి టెండ్యూలర్-అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. త్వరలోనే ఈ…
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఇద్దరు వీడ్కోలు పలికారు. ఈ రెండు సిరీస్‌ల అనంతరం ఆటగాళ్ల స్థాయిలోనే కాకుండా కోచింగ్ బృందంలో కూడా చాలా మార్పులు జరిగాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లను గత నెలలో వారి…
Ind vs Eng: ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు తన ఆరో మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఓ టెస్ట్, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సభ్యులు జోరుగా షికారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట రోహిత్, కోహ్లి షాపింగ్ అంటూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. యూకేలో కరోనా తీవ్రత…
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ తర్వాత ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో పోటీ పడింది టీం ఇండియా. అయితే ఈ సిరీస్ లోని చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయ్యింది. భారత జట్టులోని కోచ్ రవిశాస్త్రితో పాటుగా మరికొంత మంది సహాయక సిబ్బందికి కరోనా రావడంతో చివరి నిమిషంలో మ్యాచ్ ను రద్దు చేసాయి రెండు దేశాల క్రికెట్ బోర్డులు. ఆ వెంటనే అక్కడి నుండి ఐపీఎల్2021 కోసం యూఏఈ చేరుకున్నారు ఆటగాళ్లు. అయితే ఈ…
నేటి నుంచి ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాల్గో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.. లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. ఓవల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే, మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో భారత్ ఇబ్బంది పడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె సహా ఛతేశ్వర్ పుజారా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. లార్డ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానె మూడో టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.…