టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం యశస్వి ముందుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ 97 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు ఖాతాలో చేరనుంది. ప్రస్తుతం 20 టెస్టుల్లో (38 ఇన్నింగ్స్‌లు) 1903 పరుగులు చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు టెస్ట్ ఫార్మాట్‌లో 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు సాధించారు. ద్రవిడ్ 1999లో న్యూజిలాండ్‌పై, సెహ్వాగ్ 2004లో ఆస్ట్రేలియాపై ఈ రికార్డును అందుకున్నారు. యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 38 ఇన్నింగ్స్‌ల్లో 52.86 యావరేజ్‌తో 1903 రన్స్ బాదాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ మరో 97 పరుగులు చేస్తే.. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డ్‌ను అధిగస్తాడు. లీడ్స్‌లో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి 159 బంతుల్లో 101 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read: ENG vs IND: బీసీసీఐది సరైన నిర్ణయం కాదు: డివిలియర్స్
అత్యంత వేగంగా 2000 టెస్ట్ పరుగులు చేసిన లిస్ట్:
రాహుల్ ద్రవిడ్ (40 ఇన్నింగ్స్) – న్యూజిలాండ్, హామిల్టన్, 1999
వీరేంద్ర సెహ్వాగ్ (40 ఇన్నింగ్స్) – ఆస్ట్రేలియా, చెన్నై, 2001
విజయ్ హజారే (43 ఇన్నింగ్స్) – వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 1953
గౌతమ్ గంభీర్ (43 ఇన్నింగ్స్) – న్యూజిలాండ్, నేపియర్, 2009
సునీల్ గవాస్కర్ (44 ఇన్నింగ్స్) – వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 1976