Eng vs IND: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌లోనే అత్యధికంగా 269 పరుగులు చేయడం ఈ ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 269 పరుగులు సాధించాడు. జాష్ టంగ్ బౌలింగ్‌లో పాప్ కు క్యాచ్ ఇచ్చి గిల్ చివరికి ఔటయ్యాడు. విదేశీ గడ్డపై భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే.
Read Also:Rain Health Tips: వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే ఇలా చేయండి.. లేదంటే చాలా ప్రమాదం..
ఇక ఈ ఇన్నింగ్ లో గిల్‌కి మద్దతుగా రవీంద్ర జడేజా 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 89 పరుగులు చేశాడు. అలాగే ఓపెనర్ యశస్వి జైస్వాల్ 107 బంతుల్లో 87 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషభ్ పంత్ (25), నితీష్ కుమార్ రెడ్డి (1)లు రాణించలేకపోయారు. అలాగే చివర్లో వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో నిలకడగా ఆడి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. మిగిలిన టైలెండర్లు మాత్రం తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా 3 వికెట్లు తీసాడు. క్రిస్ వోక్స్, జాష్ టంగ్ 2 వికెట్లు తీశారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీశారు.
Read Also:Shubman Gill: డబుల్ సెంచరీతో చరిత్రను తిరగరాసిన కెప్టెన్ గిల్.. ఏ రికార్డులను సాధించాడంటే..?