లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. టీమిండియా ఫీల్డర్లు పలు కీలక క్యాచ్‌లు డ్రాప్ చేశారు. ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పలు క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మ్యాచ్ మూడో రోజైన ఆదివారం టీ విరామం వరకు ఆరు క్యాచ్‌లను మనోళ్లు వదిలేశారు. ఫీల్డింగ్ పరంగా గత ఐదేళ్లలో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పాలి. ప్రస్తుతం టీమ్ మొత్తం యువ ఆటగాళ్లతో ఉందని,…
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా.. పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమాలిని ఉల్లంగించినట్లు తేలితే పంత్‌కు కఠిన…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన క్రికెట్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తనలో శక్తి ఉన్నంతవరకూ క్రికెట్ ఆడుతూనే ఉంటానని చెప్పాడు. ఉత్తమ ప్రతిభను ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆ తర్వాత విషయాలు దేవుడికి వదిలేస్తాను అని తెలిపాడు. తన గురించి మాట్లాడుకునే వారిని నియంత్రించలేనని బుమ్రా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మూడో రోజు ఆట అనంతరం బుమ్రా మాట్లాడాడు. అంతర్జాతీయ…
టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 8 ఏళ్ల 84 రోజుల అనంతరం, 402 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ రయద్ ఎమ్రిట్‌ను అధిగమించాడు. ఎమ్రిట్ 396 మ్యాచ్‌ల (10 ఏళ్ల 337 రోజులు) తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్…
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని, అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అన్నాడు. ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ఓ ఓవర్లో ఆడరాని బంతులు కనీసం 3-4 వేస్తాడని, ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం చాలా కష్టం అని డకెట్ ప్రశంసించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 465 పరుగులకు…
Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ప్లేయర్లు బ్యాటింగ్ లో రెచ్చిపోతున్నారు. మొదటి రోజు యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీలో అదరగొట్టగా, రెండో రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో దుమ్మురేపాడు. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలతో ఇంగ్లాండ్ పై భారత్ అధిపత్యం కొనసాగిస్తోంది.
Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తొలి టెస్టు మ్యాచ్ లోని మొదటి ఇన్సింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు బాది కేరీర్ లోనే ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియాలి ఇది కొత్త శకం. ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్ గెలిచి 18 ఏళ్లు అవుతుంది అంటే.. అక్కడ జట్టును నడిపించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా ఇంగ్లీష్ గడ్డపై పర్యటిస్తున్నా.. అక్కడ మూడుసార్లు మాత్రమే భారత్ టెస్టు సిరీస్ గెలిచింది.…
ఆటకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటున్నా అని, ఎప్పుడు అవకాశం లభించినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అని టీమిండియా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా తెలిపాడు. సెలెక్షన్ తన చేతుల్లో లేదని, ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. కచ్చితంగా క్రికెట్ ఆడటాన్ని కొనసాగిస్తా అని, భారత జట్టుకు మళ్లీ ఆడే అవకాశం లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని పుజారా పేర్కొన్నాడు. ‘నయా వాల్’గా పేరు తెచ్చుకున్న పుజారా.. ఫామ్ లేమితో భారత జట్టులో స్థానం…
టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. త్వరగా వికెట్స్ పడినప్పుడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, అవసరమైనపుడు గేర్ మార్చి వేగంగా పరుగులు చేయడం ఈ స్థానం ప్రత్యేకత. జట్టుకు వెన్నెముక అయిన ఈ స్థానంలో భారత్ తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్నో టెస్టులు (179 టెస్టులు) ఆడాడు. సచిన్ రిటైర్మెంట్ అనంతరం కింగ్ విరాట్ కోహ్లీ (99 టెస్టులు) ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇప్పుడు కోహ్లీ కూడా టెస్టులకు…