Ravindra Jadeja’s innings at Lord’s: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టడానికి పోరాట ఇన్నింగ్స్ ఆడాడు. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బ్రైడాన్ కార్స్‌ల పదునైన ఫాస్ట్ బౌలింగ్ ముందు టీమిండియా టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఓ సమయంలో భారత్ స్కోరు 7 వికెట్లకు 82 కాగా.. కాసేపటికి 8 వికెట్లకు 112గా మారింది. ఈ సమయంలో ఇంగ్లండ్ ఉదయం సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించేస్తుంది…
టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించినప్పటి నుంచి ఈ పంజాబ్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 585 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ…
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లు తీసి.. తన పేరును ఆనర్స్ బోర్డుపై లిఖించుకున్నాడు. రెండోరోజు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా మాట్లాడుతూ నవ్వులు పోయించాడు. బుమ్రా మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్ ఫోన్ మోగింది. వేంటనే స్పందించిన బుమ్రా.. ‘ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు’ అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్…
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. లార్డ్స్‌లో ఫైవ్ వికెట్ హాల్ (5/74) ప్రదర్శన చేశాడు. హ్యారీ బ్రూక్ (11), బెన్ స్టోక్స్ (44), జో రూట్ (104), క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4)లను బుమ్రా అవుట్ చేశాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మొదటిసారి ఫైవ్ వికెట్ హాల్ తీసినా.. పెద్దగా సంబరాలు చేసుకోలేదు. లార్డ్స్ మైదానంలో అరుదైన ఘటన నెలకొల్పినా.. సెలెబ్రేషన్స్ ఎందుకు…
టీమిండియా స్టార్ పేసర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. బ్యాటర్లకు తన పేస్ పదునుతో చుక్కలు చూపిస్తాడు. పిచ్ ఏదైనా, మ్యాచ్ ఎక్కడైనా చెలరేగిపోతుంటాడు. ఎంతటి డేంజరస్ బ్యాటర్ అయినా.. బూమ్ బూమ్ ముందు తలొంచాల్సిందే. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్‌ను సైతం అద్భుత బంతితో బోల్తా కొట్టిస్తుంటాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో సెంచరీ హీరో జో రూట్ (104)ను బుమ్రా అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్…
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 112.3 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీ (104) బాదాడు. జెమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) హాఫ్ సెంచరీలు చేయగా.. ఓలీ పోప్ (44), బెన్ స్టోక్స్ (44)లు రాణించారు. హ్యారీ బ్రూక్ (11) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ పడగొట్టగా.. నితీశ్ కుమార్ రెడ్డి,…
ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ సరసన నిలిచాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు…
Most Test Hundreds List: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. లార్డ్స్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ చేయడంతో రూట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ద్రవిడ్ సహా ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉంది.…
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజులో రెండో సెషన్ ముగిసింది. మొదటి సెషన్‌లో భారత్ ఆధిపత్యం సాధించగా.. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. 24 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 70 రన్స్ చేసింది. జో రూట్ (54) హాఫ్ సెంచరీ చేయగా.. ఓలీ పోప్ (44) అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు. రెండో సెషన్‌లో ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు కష్టపడ్డా ఫలితం దక్కలేదు.…
IND vs ENG 3rd Test Playing 11: ఆండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో భాగంగా మరికొద్ది సేపట్లో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు. జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్ ఆడనున్నాడు. ఒక్క మార్పు మినహా రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.…