Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Schedule 2026: విశ్వవిజేతగా నిలిచిన భారత్.. టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండోసారి సగౌరవంగా ముద్దాడి, అజేయ శక్తిగా నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. గత నెల రోజులుగా పొట్టి ప్రపంచకప్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసిన భారత ఆటగాళ్లు.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ట్రోఫీని కైవసం చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ఆ విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, భారత జట్టు మళ్లీ బ్లూ జెర్సీ ధరించి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతకీ టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: LPG Shortage: హోటళ్లకు గ్యాస్ కొరత.. మెనూ మార్చేసిన హోటళ్లు.. వాటికే పరిమితం..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ప్రపంచ కప్ విజయం తర్వాత టీమిండియాకు సుమారు 96 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి భారీ విశ్రాంతి లభించింది. ఈ విరామం తర్వాత భారత జట్టు – అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ఆడనుంది. జూన్ 6 న న్యూచండీగఢ్‌లో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ టెస్టు ముగిసిన వెంటనే అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లు స్టార్ట్ అవుతాయి. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, భారత ఆటగాళ్లు మాత్రం మనల్ని ఐపీఎల్‌లో అలరించనున్నారు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న IPL 2026లో స్టార్ ప్లేయర్స్ అందరూ తమ తమ జట్ల తరపున బరిలోకి దిగుతారు. ఈ టోర్నీ మే 31తో ముగుస్తుంది. ఐపీఎల్ ఫీవర్ తగ్గిన వెంటనే అఫ్గాన్ సిరీస్‌తో టీమ్ ఇండియా ప్రయాణం స్టార్ట్ అవుతుంది.
టీమిండియా 2026 ‘రోడ్ మ్యాప్’:
అఫ్గానిస్థాన్‌తో పోరు ముగిశాక, భారత జట్టు వరుస విదేశీ పర్యటనలతో బిజీగా ఉండనుంది.
జూలై – ఇంగ్లాండ్ పర్యటన: ఇంగ్లీష్ గడ్డపై 5 టీ20లు, 3 వన్డేల సిరీస్.
ఆగస్టు – లంక పర్యటన: శ్రీలంక గడ్డపై వన్డే, టీ20 సమరం.
సెప్టెంబర్/అక్టోబర్ – వెస్టిండీస్: కరీబియన్ దీవుల్లో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు.
అక్టోబర్/నవంబర్ – న్యూజిలాండ్ టూర్: కివీస్ గడ్డపై 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు.
డిసెంబర్ – స్వదేశంలో లంకతో పోరు: 2026 ముగింపులో శ్రీలంక జట్టు భారత్‌కు రానుంది (3 వన్డేలు, 3 టీ20లు).
మొత్తానికి ప్రపంచ కప్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు 2026లో భారీ సవాళ్లు ఎదురుకానున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!