ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన 2వ టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. అసలు మొదటి టెస్టులో ఓడిన తర్వాత, బుమ్రా లేకుండా బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఎలా ఆడుతుందో అని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ, ఎడ్జ్ బస్టన్ లో మనవాళ్ళు మొట్ట మొదటి విజయాన్ని అందుకున్నారు.
ఇది కూడా చదవండి: Sub-Registrar Office : సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకే ఈ గతి పడితే, సామాన్యుల సంగతేంటి..?
దీనికి కారణం ఒక్కడే అంటే నమ్ముతారా.. అవును, టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ శుభమన్ గిల్ రెండు ఇన్నింగ్సుల్లోనూ రెచ్చిపోయి ఆడాడు. మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేస్తే, 2వ ఇన్నింగ్సులో 161 పరుగులు చేసాడు. గిల్ తో పాటు మిగతా బ్యాటర్లు అందరూ రాణించడంతో మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ చేశారు . ఇక 2వ ఇన్నింగ్స్లో 427 పరుగులు చేశారు. ఇలా బ్యాటింగ్ లో బాగా ఆడినా… బౌలింగ్ లో అదరగొట్టిన ఆకాష్ దీప్ వల్లే మ్యాచ్ గెలిచింది అంటే మీరు నమ్ముతారా.
ఇది కూడా చదవండి: Tahawwur Rana: పాక్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్‌ను.. దాడుల సమయంలో ముంబైలోనే ఉన్నట్లు వెల్లడి
అవును, బౌలింగ్లో ఆకాష్ దీప్ ఈ టెస్టులో ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా ఎంత స్కోర్ చేసినా, ఇంగ్లాండ్ బ్యాటర్లు కొట్టేస్తున్నారు, కానీ వారికి అడ్డుకట్ట వేసింది మాత్రం ఆకాష్ దీప్.మొదటి ఇన్నింగ్స్లో, మ్యాచ్ మళ్ళీ చేజారిపోతుందేమో అనేసరికి 4 కీలక వికెట్లు తీసాడు. ఇక 2వ ఇన్నింగ్స్లోనూ 6 వికెట్లు పడగొట్టి టీమిండియాను గెలిపించాడు. ఇలా కీలక సమయాల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేసి. టీంఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.