ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ టీమ్స్ చెరో మ్యాచ్ గెలిచాయి. జులై 10 నుంచి లార్డ్స్‌లో మూడవ టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మూడో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. మూడో టెస్టులో ఆడడం టీమిండియాకు సానుకూలాంశం. అయితే లార్డ్స్ టెస్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడేది అనుమానంగానే ఉంది.
Also Read: Minister Seethakka : తప్పుడు ప్రచారం చేస్తే నాశనం తప్పదు కేటీఆర్..!
మొదటి టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్ 41 ఓవర్లు వేశాడు. రెండో టెస్టులో 32 ఓవర్లు వేశాడు. రెండు టెస్టుల్లో కలిపి 73 ఓవర్లలో 9 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్ట్, మూడో టెస్టుకు మధ్య మూడు రోజులే గ్యాప్ ఉంది. వర్క్ లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. సిరాజ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ సిరాజ్ జట్టులో ఉన్నా.. రెండో టెస్టులో పెద్దగా ప్రభావం చూపని ప్రసిద్ధ్ కృష్ణకు బదులు అర్ష్‌దీప్ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. మూడో టెస్టులో బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ ఉంటే ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.