ఇంగ్లండ్ గడ్డ మీద భారత జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెలరేగుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147).. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. వరుస సెంచరీలు బాదిన గిల్.. పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌పై కింగ్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అద్భుతంగా ఆడుతున్నావని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావని కింగ్ పేర్కొన్నాడు.
Also Read: ENG vs IND: మేం ఏం స్టుపిడ్స్ కాదు.. ఇంగ్లండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శుభ్‌మన్ గిల్‌ను ప్రశంసించాడు. ‘స్టార్ బాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. చరిత్ర సృష్టించాడు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావని ఆశిస్తున్నా. అన్నింటికీ అర్హుడవు’ అని కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. గిల్ ఇంగ్లీష్ గడ్డపై నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడవ సెంచరీలు చేశాడు. సునీల్ గవాస్కర్ తర్వాత ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. ఓ టెస్టులో అత్యధిక స్కోరు (430) చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు 150 ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గా కూడా మరో రికార్డు నెలకొల్పాడు.