Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!
- దుమ్మురేపుతున్న టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
- రెండో టెస్ట్ మ్యాచ్‌లో ద్విశతకం, శతకం
- గిల్ రికార్డులే రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దుమ్మురేపుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. గిల్ భీకర ఫామ్‌లో ఉన్న వేళ.. రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. వరుస సెంచరీలు బాదిన గిల్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 430 పరుగులు చేశాడు. దాంతో ఓ టెస్టులో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గ్రాహం గూచ్ (456) మొదటి స్థానంలో ఉన్నాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు 150 ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ అలెన్ బోర్డర్. బోర్డర్ 1980లో పాకిస్థాన్‌పై 150, 153 రన్స్ చేశాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సాధించిన తొమ్మిదో బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఈ జాబితాలో భారత్ నుంచి సునీల్ గవాస్కర్ ఉన్నారు.
Also Read
Also Read: Rishabh Pant: నాకు అంత అత్యాశ లేదు.. ఇంగ్లండ్ ప్లేయర్‌కు ‘పంత్’ పంచ్!
సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ తర్వాత టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన మూడో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో నాలుగు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమైన తొలి భారత ఆటగాడు గిల్. ఇంకా మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో గిల్ మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!