కరుగుడట్టిన ఉగ్రవాదిని జమ్మూ కశ్మీరులో ఖతం చేశాయి భద్రతాబలగాలు.. అత్యంత భయానక ఉగ్రవాది అయిన ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును… ఇవాళ మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ… పుల్వామాలోని నాగ్‌బెరన్-తార్సర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఇ-మహ్మద్ (జెఎమ్) తో అనుబంధంగా ఉన్న అగ్రశ్రేణి పాకిస్థాన్ తీవ్రవాది హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపోరా పట్టణ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇంకా గుర్తించబడని మరో ఉగ్రవాది కూడా మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయానికి మీడియాకు వెల్లడించారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్… ఈరోజు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పాక్ ఉగ్రవాది లంబూ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్టు ప్రకటించారు.. ఇక, లంబూతో పాటు మరో ఉగ్రవాది కూడా మరణించాడని.. కానీ, అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.. కాగా, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో లంబూదే కీలక పాత్ర.. పేలుడు పదార్థాలను లంబూ తయారు చేసి.. దాడికి స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు.