ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గడ్ సరిహద్దు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నా పురం సమీపంలోని సుక్మా, బీజాపుర్ జిల్లాల అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహోండ్స్ దళాలకు–మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఏరియాలో మావోయిస్టుల పలు విధ్వంసాలకు పాల్పడడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులపై పై చేయి సాధించేందుకు భారీ ఎత్తున కూంబింగ్ లు కొనసాగిస్తున్నారు.
గత వారం రోజుల క్రితం చెన్నాపురం ఏరియాలో మావోయిస్టులు మందు పాతర పెట్టిన ఘటనలో ఒక ఆర్ఎస్ ఐ, జవాన్ గాయపడ్డారు. అదే విధంగా రెండు రోజుల క్రితం వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసి మావోయిస్టులు హత్య చేశారు. దీంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత పై ముమ్మర గాలింపు చర్యలను చేపట్టారు. ఈ నేపధ్యంలో ఛత్తీస్ గడ్ రాష్ర్టంలోని కిష్టారం, సుక్మా జిల్లాల మద్య మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల ఘటన లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!