Eluru: జంతు కొవ్వుతో నూనె తయారీ.. నకిలీ నూనె గుట్టురట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru: ఏలూరులో నకిలీ నూనె తయారీ వ్యవహారం సంచలనం సృష్టించింది. జంతు కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్టురట్టు చేశారు. ఆదివారపు పేట, తంగేళ్లమూడి ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో భారీగా నకిలీ నూనెను స్వాధీనం చేసుకున్నారు.
Share Market: జీవం పోసిన అమెరికా-భారత్ ట్రేడ్ డీల్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
అధికారుల సమాచారం ప్రకారం.. కబేళాల నుంచి సేకరించిన జంతు కొవ్వు, ఎముకలను మరిగించి వచ్చిన చమురుతో నూనె తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. తయారు చేసిన నూనెను తక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల్లో సుమారు 600 కేజీల జంతు కొవ్వుతో తయారు చేసిన నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నూనె తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలు, ముడిసరుకు పదార్థాలను కూడా జప్తు చేసినట్లు సమాచారం.
Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదే?
ఈ వ్యవహారంలో భాగంగా ఇద్దరు నకిలీ నూనె తయారీ దారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక అక్రమంగా నకిలీ నూనె తయారు చేసి విక్రయిస్తున్నందుకు సంబంధిత వ్యక్తులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!