ఏలూరు జిల్లాకు చెందిన బొట్ల కనకరావు సారా అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి నాలుగు రోజులపాటు రిమాండ్ కి వెళ్లి వచ్చాడు. జైలు నుంచి బయటకి వచ్చి తన సొంత గ్రామం ముసునూరు మండలం లోపూడి గ్రామంలో సొంత ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలో గౌడ కులానికి చెందిన కుల పెద్దలు కనకారావు కుటుంబాన్ని 10రోజుల క్రితం మోకాలు దండ పై నిలబెట్టి పంచాయతీ పెట్టారు. పంచాయతీలో లక్ష రూపాయలు అపరాధ రుసుము విధించారు. కనకారావు కుటుంబం ఆ మొత్తాన్ని కట్టలేమని తేల్చి చెప్పింది.
Also Read:US vs Venezuela Military Power: అమెరికా ముందు వెనిజులా సైనిక శక్తి ఎంత? ఎవరి బలం ఎంతో తెలుసా!
దీంతో ఆగ్రహించిన కుల పెద్దలు కనకరావు కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దు అని హుకుం జారీ చేశారు. ఎవ్వరూ పలకరించక పోవటంతో మనస్థాపానికి గురైంది కనకారావు కుటుంబం. శనివారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కనకారావు కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశామని ప్రతి ఇంటికి చెప్పారు. కనకరావు తన భార్య ఇద్దరు పిల్లలతో సెల్ఫ్ వీడియో తీసి ఈ అవమానం భరించలేము, మేమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. సమాచార అందుకున్న పోలీసులు అర్థరాత్రి నుండి కనకరావు కుటుంబం కోసం గాలింపు చేపట్టారు.