H-1B Visas: మంచి వేతనాలను తీసుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికే హెచ్-1బీ వీసా ఉపయోగపడుతోందని యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపణలు చేశారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకునే ప్రమాదం ఉందని ఆక్షేపించారు.
SpaceX Starship destroyed: అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు కదుపుకు గురైంది. స్పేస్‌ఎక్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ ఫెయిల్ అయింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్‌మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ హాజరవుతారని పేర్కొన్నారు.
భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29, 2020 ఒక ప్రకటనలో తెలిపింది. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.…
భారత్ వంటి దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత అమెరికాలో కూడా టిక్‌టాక్ '(TikTok)పై వేటు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో చైనా టిక్‌టాక్ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తోంది. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. చైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి టిక్ టాక్ ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
Giorgia Meloni: బిలియనీర్ జార్జ్ సోరోస్ విదేశాల రాజకీయాల్లో జోక్యానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇత దేశాల రాజకీయాల్లో కలుగుజేసుకుంటున్నారని ఆమె అన్నారు. దేశాలను అస్థిరపరచడానికి తన డబ్బును ఉపయోగిస్తున్నారని మెలోనీ గురువారం అన్నారు. యూరప్ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్న తరుణంలో మెలోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో యూరప్‌లో రాజకీయాల…
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రియాక్ట్ అయ్యారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై మండిపడుతున్నాయన్నారు. పలు సందర్భాల్లో ఇటలీ, ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని తెలిపింది.
Priyanka Chaturvedi: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ‘‘పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్’’ అరచకాలపై అక్కడి ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని విమర్శిస్తున్నారు. జాతీయ విచారణకు అక్కడి ప్రభుత్వ నో చెప్పడంపై విమర్శలు వెల్లువెతున్నాయి.
Elon Musk: భారత్, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్రమంగా క్షీణించడంపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటని చెప్పుకొచ్చాడు.
George Soros: బిలియనీర్ జార్జ్ సోరోస్‌ని ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’తో గౌరవించాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్ బహిరంగంగా విమర్శించారు. ‘‘బైడెన్ సోరోస్‌కి ప్రెసిడెన్షియల్ మెడల్ని ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఒక విడ్డూరం’’ అని మస్క్ విమర్శించారు.