Starlink: ఎలాన్ మస్క్ అనేక ఆవిష్కరణల్లో ఒకటి స్టార్‌లింక్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఈ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి రూపొందించబడింది. ప్రస్తుతం, భారత్‌లో ఈ సేవలు ప్రారంభించడానికి సంబంధించిన లైసెన్స్ సమస్యలు ఎదురైతున్నాయి. కానీ, భారత ప్రభుత్వం మౌలిక సెక్యూరిటీ రూల్స్‌ను మన్నించి చివరికి స్టార్‌లింక్ ఈ కండీషన్లను అంగీకరించడంతో ఈ సేవలు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకరాబోతున్నట్లు సమాచారం. Also Read: Virat Kohli: రంజీ…
Trump - Musk: గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం గురించిన కొన్ని కథలు హాట్ టాపిక్ అయ్యాయి.
అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి.. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే కాదు.. అన్ని స్థాయిల వ్యక్తుల గురించి ఈ మాట చెబుతున్నాను అన్నారు.
Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో సంచలన మార్పులు చేసి, “ఎవ్రీథింగ్ యాప్” కోసం టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆహ్వానించారు. ఈ నియామక ప్రక్రియలో డిగ్రీల అవసరం, గత అనుభవం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏ స్కూల్‌కు వెళ్లారో కూడా తెలపాల్సిన అవసరం లేదని.. కేవలం మీ…
H-1B Visas: మంచి వేతనాలను తీసుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికే హెచ్-1బీ వీసా ఉపయోగపడుతోందని యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపణలు చేశారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకునే ప్రమాదం ఉందని ఆక్షేపించారు.
SpaceX Starship destroyed: అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు కదుపుకు గురైంది. స్పేస్ఎక్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ ఫెయిల్ అయింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్‌మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ హాజరవుతారని పేర్కొన్నారు.
భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29, 2020 ఒక ప్రకటనలో తెలిపింది. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.…
భారత్ వంటి దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత అమెరికాలో కూడా టిక్‌టాక్ '(TikTok)పై వేటు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో చైనా టిక్‌టాక్ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తోంది. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. చైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి టిక్ టాక్ ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.