ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌లలో భారత్ కూడా ఒకటి. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఎన్నో కార్ల కంపెనీలు ఇండియాలో ప్లాంట్‌లను ఏర్పాటు చేసి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కార్ల నుంచి, ప్రీమియం బ్రాండ్ కార్ల వరకు ఇండియాలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లను ఇండియాలో నెలకొల్పేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే, ఎలన్ మస్క్ కు చెందని టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఎప్పటి నుంచో…
ప్రపంచకుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ చిక్కుల్లో పడింది. ఇటీవలే టెస్లా కంపెనీ చెందిన షోరూమ్‌ను చైనాలో లాంచ్ చేశారు. జిన్ జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభించారు. ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఎలన్ మస్క్ విబోలో ప్రకటించాడు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు వాణిజ్య సంస్థలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎలన్ మస్క్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. Read: కోడి పందాలపై హైకోర్టులో పిటిషన్..…
స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు రాకెట్లు తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనిషి చంద్రునిమీదకు వెళ్లివచ్చారు. అయితే, త్వరలోనే చంద్రునిమీద ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమిపై ఇబ్బందులు తెలత్తితే మనిషి మనుగడ సాగించేందుకు ఇతర గ్రహాలపైకి వలస వెళ్లేందుకు వీలుగా ప్రయోగాలు చేస్తున్నారు. మరో ఐదేళ్లలో మార్స్ మీదకు మనుషులను పంపుతామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెబుతున్నారు. Read: సోము వీర్రాజు కొత్త డిమాండ్……
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి స్టార్ లింక్స్ ను రోదసిలోకి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వేగవంతం చేసేందుకు ఈ స్టార్ లింక్స్ తోడ్పడతాయి. సుమారు 42 వేల స్టార్ లింక్స్‌ను రోదసిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1800 లకు పైగా స్టార్ లింక్ లను ప్రవేశపెట్టారు. ఈ స్టార్ లింక్ ల కారణంగా చైనా అంతరిక్ష కేంద్రం టియాన్జేకు ముప్పు ఏర్పడినట్టు ఆ దేశ అంతరిక్ష సంస్థ తెలియజేసింది. 2001 జులై…
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ బిజినెస్ మెన్ అయితే ఆయన అత్యంత కౄరుడు కావడంతో ఆయనంటే మస్క్‌కు నచ్చదు. అందుకే చిన్నతనం నుంచి కష్టపడి తన సొంతకాళ్లపై నిలబడుతూ చదువుకున్నాడు. చదువుకునే రోజుల నుంచే పనిచేయడం మొదలుపెట్టాడు. కష్టం విలువ తెలుసు కాబట్టే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగగలిగాడు. అయితే, చిన్నతనం నుంచి మస్క్ నలుగురిలో మాట్లాడాలంటే భయపడిపోతాడు. చాలా భయస్తుడు. మస్క్‌కు ఆటిజం సమస్య ఉంది. ఆ భయం.…
టెస్లా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తూ వస్తున్నది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు ఎంత డిమాండ్ ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. టెస్లా లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. కాగా, టెస్లా కంపెనీ ఇప్పుడు మొబైల్ తయారీ రంగంలోకి కూడా ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దీనిపై వార్తలు వస్తున్నాయి. అయితే, ఎలన్ మస్క్ దీనిని ఖరారు చేయలేదు. మోడల్ పైపీ పేరుతో స్మార్ట్ ఫోన్లను తయారు…
టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా…
ఎలన్ మస్క్ నిత్యం ఏదోక విషయంపై ట్రెండింగ్‌లో ఉంటుంటాడు. టెస్లా కంపెనీలో తన షేర్ల విషయంలో ఇటీవలే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నది. కంపెనీలో తన షేర్లను విక్రయిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. నెటిజన్ల అభిప్రాయం కోరాడు. అనంతరం టెస్లాలో తనకు సంబంధించిన కొన్ని షేర్లను అమ్మేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి ఎలా ఉన్నా, కంపెనీలో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్నాయి. Read: రాహుల్ గాంధీకీలక వ్యాఖ్యలు… ఏం మారలేదు……
ఎలన్ మస్క్ పరిచయం అక్కర్లేని పేరు. టెస్లా కార్ల కంపెనీని స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అంతేకాకుండా, స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్నారు. ప్రపంచ కుబేరులను వెనక్కి నెట్టి ఎలన్ మస్క్ ప్రథమస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 300 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఎలన్ మస్క్ ను కీర్తిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. మస్క్ 17 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చాడని, సంపదను సృష్టించి…