మొదటి నుంచి టెస్లా అధినేత ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. తాజా మరోసారి అధ్యక్షుడు జో పై మండిపడ్డాడు. 2030 నాటికి అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగంపై అధ్యక్షుడు బైడెన్ సమీక్షను నిర్వహించారు. వినియోగం, పెట్టుబడి అంశంలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల అధినేతలతో జో బైడెన్ సమావేశం అయ్యారు. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను జనరల్ మోటార్స్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను పిలువలేదు. ఆ కంపెనీ గురించి జో ప్రస్తావించలేదు.
Read: కొత్త శ్రీనివాస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కేటీఆర్
దీంతో జో బైడెన్‌పై మస్క్ విచురుకుపడ్డారు. జో బైడెన్‌ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆయన్ను ఫూల్స్ గా మాదిరిగా అమెరికా ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. దీంతో మస్క్‌కు, అమెరికా ప్రభుత్వానికి మధ్య దూరం మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. ఎలన్ మస్క్ ట్యాక్స్ విషయంలో గతంలో ఆయన చేసిన ట్వీట్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఎలన్ కట్టాల్సిన ట్యాక్స్ కంటే తక్కువగా కడుతున్నారని గతంలో రాజకీయ నాయకులు మండిపడిన సంగతి తెలిసిందే.