టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం…
టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ సంస్థ డైరక్టర్ల బోర్డుకు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేఛేంజ్ కమిషన్‌కి ఎలన్ మస్క్ నిష్క్రమణ గురించి ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ తెలిపింది. ఈ ఏడాది జూన్ తర్వాత మస్క్ డైరక్టర్ల బోర్డులో ఉండబోరని తెలిపింది. అమెరికాకు చెందిన ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ మీడియా, హాలీవుడ్, మార్కెటింగ్ విభాగాల్లో భారీ ఆదరణను పొందింది. అనుబంధ సంస్థల ద్వారా వినోద కంటెంట్‌ను…
ఎలన్ మస్క్ చెప్పిన విధంగా ఐరాసకు భారీ విరాళం ప్రకటించారు. ప్రపంచంలోని చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై గతంలో ఎలన్ మస్క్ స్పందించిన సంగతి తెలిసిందే. చిన్నారుల ఆకలి తీర్చేందుకు తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన టెస్లా కంపెనీలోని 5 మిలియన్ షేర్లను చిన్నారుల ఆకలిని తీర్చడం కోసం ఐరాస వరల్డ్ ఫుడ్…
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చేలా చూసేందుకు ఎలన్ మస్క్ స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎలన్ మస్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్ వన్‌వెబ్ పేరుతో ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి భారతీ ఎయిర్‌టెల్ 34 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇంటర్నెట్ కోసం ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఏడాది ఎయిర్ టెల్ ప్రయోగించిన మొదటి ప్రయోగం ఇది. 34 ఉపగ్రహాలను…
దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలనే ఉద్దేశంతో ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ పేరుతో ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్‌లింక్స్ ఉపగ్రహాలు ఒకదానితో మరోకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. ఇటీవలే 49 స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగించింది స్పేస్ ఎక్స్ సంస్థ. ప్రయోగించిన 49 స్టార్‌లింక్స్ ఉపగ్రహాల్లో 40 దారితప్పాయి. ఇందులో కొన్ని ఉపగ్రహాలు భూవాతావరణంలోకి ప్రవేశించి భూమిపై కూలిపోయాయి. Read: Covid 19: ఆ వ్యక్తిని…
ఎలన్ మస్క్‌కు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. టెస్లా కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు కేంద్రం నో చెప్పింది. అయితే, పాక్షికంగా తయారు చేసిన ఈవీ వాహనాలను ఇండియాలో అసెంబ్లింగ్ చేయడం ద్వారా దిగుమతి సుంకం తగ్గుతుందని కేంద్రం మరోసారి పేర్కొన్నది. టెస్లా కంపెనీ ఇండియాలో ఏర్పాటు చేసే ప్లాంట్, భవిష్యత్‌పై నివేదిక కోరగా, ఇప్పటి వరకు టెస్లా నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, ఇప్పటికే దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారవుతున్నాయని, వివిధ విదేశీ కంపెనీలు పాక్షికంగా…
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి దిగ్గజం ఎలన్ మస్క్ కు కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలని చూస్తున్న బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ స్టార్టప్ న్యూరాలింక్ ప్రాజెక్టును ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఏడాది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ ఏడాది మనిషి ప్రయోగాలు చేయబోతున్నారని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారని, కానీ, ఈ ప్రాజెక్టు సక్సెస్ కాదని పలువురు మాజీ ఉద్యోగులు చెబుతున్నారు.…
ఎలక్ట్రిక్ కార్లు అనగానే గుర్తుకు వచ్చేపేరు ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా ఆయన స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. నాసాతో కలిసి రాకెట్లను తయారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో స్పేస్ ఎక్స్ ద్వారా చంద్రుని మీదకు, మార్స్ మీదకు మనుషులను పంపాలనే లక్ష్యంతో మస్క్ పనిచేస్తున్నారు. ఇలాంటి మస్క్‌ను కేవలం 19 ఏళ్ల జాక్ స్వీనీ అనే కాలేజీ కుర్రోడు భయపెట్టాడు. జాక్‌కు టెక్నాలజీ అంటే పిచ్చి…
మొదటి నుంచి టెస్లా అధినేత ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. తాజా మరోసారి అధ్యక్షుడు జో పై మండిపడ్డాడు. 2030 నాటికి అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగంపై అధ్యక్షుడు బైడెన్ సమీక్షను నిర్వహించారు. వినియోగం, పెట్టుబడి అంశంలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల అధినేతలతో జో బైడెన్ సమావేశం అయ్యారు. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను జనరల్ మోటార్స్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి టెస్లా అధినేత ఎలన్…
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. ప్రపంచంలోనే పేరుమోసిన సంస్థ టెస్లా.. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ.. ఎప్పటికప్పుడూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. టెస్లా కార్లు భారత్‌కు ఎప్పుడొస్తాయి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. తాజాగా.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించడంతో.. మరోసారి ఈ వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక అంశాలపై స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. వెంటనే ఈ అంశంపై…