ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌లలో భారత్ కూడా ఒకటి. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఎన్నో కార్ల కంపెనీలు ఇండియాలో ప్లాంట్‌లను ఏర్పాటు చేసి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కార్ల నుంచి, ప్రీమియం బ్రాండ్ కార్ల వరకు ఇండియాలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌లను ఇండియాలో నెలకొల్పేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే, ఎలన్ మస్క్ కు చెందని టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఎప్పటి నుంచో ఇండియా కార్లను ప్రవేశపెట్టాలని చూస్తున్నది.
Read: లైవ్: మెగాస్టార్ చిరంజీవి ప్రెస్‌మీట్
కానీ, దిగుమతి సుంకం 60 నుంచి వంద శాతం వరకు ఉండటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే రూ. 30 లక్షలనున్న టెస్లా బేసిక్ మోడల్ 3 కారు ధర రూ. 60 లక్షల వరకు చేరుతుంది. అధిక దిగుమతి సుంకాలు తగ్గించాలని కేంద్రంతో అనేక మార్లు ఎలన్ మస్క్ చర్చలు జరిపినట్టుగా పేర్కొన్నారు. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని మస్క్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విదేశాల దిగుమతి చేసుకొని ఆ తరువాత ఇండియాలు ప్లాంట్ ను నెలకొల్పాలని భావిస్తున్నాడు. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పితే రాయితీలు ఇస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.