ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి స్టార్ లింక్స్ ను రోదసిలోకి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వేగవంతం చేసేందుకు ఈ స్టార్ లింక్స్ తోడ్పడతాయి. సుమారు 42 వేల స్టార్ లింక్స్‌ను రోదసిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1800 లకు పైగా స్టార్ లింక్ లను ప్రవేశపెట్టారు. ఈ స్టార్ లింక్ ల కారణంగా చైనా అంతరిక్ష కేంద్రం టియాన్జేకు ముప్పు ఏర్పడినట్టు ఆ దేశ అంతరిక్ష సంస్థ తెలియజేసింది. 2001 జులై 1 నుంచి అక్టోబర్ 21 మధ్య కాలంలో ఈ స్టార్ లింక్ కారణంగా టీయాన్జేకు ముప్పు ఏర్పడిందని, అయితే, చైనా స్పైస్ సంస్థ అలర్ట్ గా ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించి స్పేస్ స్టేషన్ కక్ష్యను కాస్త జరిపినట్టు చైనా అంతరిక్ష సంస్థ తెలియజేసింది. దీంతో పెను ముప్పు తప్పిందని పేర్కొన్నది.
Read: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు…
స్పేస్ ఎక్స్ స్టార్ లింక్‌లు తమ స్పేస్ స్టేషన్‌కు రెండుసార్లు సమీపంలోకి వచ్చాయని యూన్ చీఫ్ కు చైనా ఫిర్యాదు చేసింది. 2022 చివరినాటికి చైనా టియాన్జే అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి చేయనున్నది. స్టార్ లింక్‌లతో అంతరిక్షంలో వ్యర్ధాల కుప్పలు తయారవుతున్నాయని, వీటి వలన భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, అవి స్టార్ లింకులు కాదని, అమెరికా స్పేస్ వార్‌ఫేర్‌లు అని చైనా పేర్కొన్నది. చైనా చేస్తున్న విమర్శలపై ఎలన్ మస్క్‌గాని, నాసాగాని ఇప్పటి వరకు స్పందించలేదు.