ఒక సమూహం లేదా ఓటర్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు.
ECI: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం( ECI) తీవ్రంగా ఖండించింది. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘‘రిగ్గింగ్’’ చేయబడ్డాయని ఆయన వ్యాఖ్యానించడాన్ని ఈసీ తోసిపుచ్చింది. ఓటర్లు మోసపోయారనే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. “ఓటర్లు ఏదైనా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత, ఎన్నికల సంఘం రాజీపడిందని చెప్పడం ద్వారా దాని పరువు తీయడానికి ప్రయత్నించడం పూర్తిగా అసంబద్ధం” అని పోల్ సంఘం తన బలమైన…
Bypolls 2025: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. తాజాగా, గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు నిర్వహించబోయే ఉప ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈపీఐసీ (EPIC)ని ఆధార్తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. త్వరలో యుఐడీఏఐ(UIDAI), కేంద్ర ఎన్నికల సంఘం నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు ప్రారంభం కానున్నాయి.
Supreme Court: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (EC)లకు నోటీసులు జారీచేసింది. మార్చి 22 లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ఈ…
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.
MLC Elections: మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 25,652 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.…
New CEC Gyanesh Kumar: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేశ్ కుమార్.. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఎంపికయ్యారు. అతడి స్థానంలో ఎన్నికల కమిషనర్గా.. ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి (1989 బ్యాచ్ ఐఏఎస్)ని నియమించారు.