Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో చీటింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో జరుగుతున్న తప్పులను ఆరు నెలల పాటు స్టడీ చేసినట్లు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన తప్పులను పూర్తి ఆధారాలతో నిరూపిస్తాం అని చెప్పుకొచ్చారు. ఒక నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అందులో 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షలు నకిలీ ఓట్లుగా తేలాయని చెప్పారు. సరిగ్గా ఎన్నికలు జరిగి ఉంటే ప్రస్తుతం బీజేపీ గెలిచిన సీట్ల కంటే 15 , 20 సీట్లు తక్కువ వచ్చి ఉండేవని.. అలా అయి ఉంటే ప్రధానిగా మోడీ ఉండేవారు కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: Food Safety Officers Rides: హోటళ్లలో లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..!
ఇక, దేశంలో రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా పని చేయాల్సిన భారత ఎన్నికల సంఘానికి ప్రాణం లేకుండా పోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. 2014 నుంచే ఎన్నికల సిస్టం పై అనుమానాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది.. అత్యంత తక్కువగా ఓట్లు వచ్చాయి.. దాంతో మాకు ఆశ్చర్యమేసింది.. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే ఆధారాలు ఏంటి అని బదులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ వ్యవహారం మరింత స్పష్టమైంది.. అక్కడ జరిగిన లోక్సభ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం.. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్యలో కోటి ఓట్లు ఎక్కువగా వచ్చే చేరాయి.. బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్లను తీసుకువచ్చి ఓటర్లుగా చేర్చారు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Read Also: Mumbai: ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. కలవరపెడుతున్న వరుస ఘటనలు
అలాగే, ఎన్నికల సంఘం ఓట్ల జాబితా విషయంలో, ఎన్నికల సరళిపై ఎన్ని లేఖలు రాసిన ఫలితం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అంతేకాదు ఓట్ల జాబితాను పరిశీలిస్తే, కనీసం స్కాన్ చేయకుండా దాన్ని స్కాన్ ప్రూఫ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఏదేమైనా దేశంలో రాజ్యాంగం సరిగ్గా అమలయ్యేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యాయవాదులు అందరూ లీగల్ గా పోరాడాలని పిలుపునిచ్చారు.