హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం పోలింగ్‌కు మూడు రోజుల ముందు స్థానికేతర నాయకులు హుజూరాబాద్‌ను వీడాలి. ప్రధాన పార్టీలకు నిజంగా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీంతో ఆయా పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. గత మూడు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు కాని టిఆర్ఎస్, బిజెపి,…
దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్ లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు పిటీషనర్లు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆమలవుతుందని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి హుజూరాబాద్ ఉప ఎన్నికలు బ్రేక్ వేశాయి.. ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముగిసే వరకు నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం అమలును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. ఆ పథకం కింద అన్ని దశలలోని నగదు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది ఈసీ.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన ఆయన..…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది. దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు తెరాస ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని తెచ్చి రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని హుజురాబాద్ నుండే ప్రారంభించనున్నట్లు తెలిపింది. దాంతో దీని పై చాలా ఫిర్యాదులు…
హుజురాబాద్‌లో అట్టహాస ప్రచారానికి EC ఆంక్షలు అడ్డంకిగా మారాయి. దీంతో పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. హుజురాబాద్‌లో కాలు పెట్టకుండానే ఆ ప్రభావం ఉపఎన్నికపై పడేలా వ్యూహ రచనలో పడ్డాయట. వరస మీటింగ్‌లతో బైఎలక్షన్‌లో ఊపు తీసుకొచ్చే పనిలో ఉన్నాయట. ఈ విషయంలో అధికారపార్టీ ఆలోచన ఏంటి? హుజురాబాద్‌లో ప్రచార ఊపు తీసుకొచ్చేలా టీఆర్ఎస్ ప్లీనరీ? తెలంగాణలో గతంలో జరిగిన ఉపఎన్నికల ప్రచారానికి భిన్నంగా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయి కానీ.. భారీ…
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టినెలకొంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉపఎన్నిక మారిపోవడంతో ఫలితం ఎలా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నేతలంతా నువ్వా.. నేనా? అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇదే అదనుగా ఎన్నికల అధికారులు సైతం దూకుడుగా వెళుతున్న నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 13రోజుల్లోనే ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులపై 40కిపైగా కేసులు నమోదు చేశారు. దీంతో హుజూరాబాద్ బైపోల్ కేసుల…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది… తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు.. ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిగా దాసరి సుధాను ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
ఈనెల 30 వ తేదీన పశ్చిమ బెంగాల్‌కు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. భవానీ పూర్ నియోజక వర్గానికి జరిగే ఉప ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలోఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక తిబ్రేవాల్ పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ నందిగ్రామ్ ఓటమి తరువాత మమతా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, బెంగాల్ అసెంబ్లీ…
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. వీటితో పాటు బీహార్‌లో ఒక శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.వాయిస్..ఈ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ కు సెప్టెంబర్ 22 తుది…
2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం.. ఆగస్టు 9 నుంచి 31వ తేదీ వరకు ముందస్తు కార్యక్రమాలు. ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ కొనసాగనుంది.. 2021 నవంబర్ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుంది.. నవంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు.. డిసెంబర్ 20 వరకు అభ్యంతరాలు, వినతులు పరిష్కరించనున్నారు.. 2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ చేయనున్నారు.. 2022 జనవరి 5న ఓటర్ల…