హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో మోడల్ కోడ్ ఉంటుంది-శశాంక్ గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ షెడ్యూల్‌కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. లోకల్ 12 సీట్లకు షెడ్యూల్ ప్రకటన చేయగా.. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సీటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10 పోలింగ్, డిసెంబర్ 14 కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, కరోనా నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భారత ఎన్నికల సంఘం ఇచ్చిన కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కూడా అందరికి వేయాలని, ఇవాల్టి నుండి మోడల్ కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఏవిధంగా ఉంటుందో అలానే ఈ ఎన్నికలకు కోడ్ ఉంటుందని, అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల నేతలు, ఓటర్లు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు, మోడల్ కోడ్ ను పాటించాలన్నారు.
500 మంది కంటే ఎక్కువ మందితో సభలు సమావేశాలు పెట్టరాదని, ఎలాంటి రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఉంటుందని, హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలో మోడల్ కోడ్ ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్లలో ర్యాలీలు లేవు, వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుంది. స్టార్ క్యంపైనర్ లు ఉండరని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!