ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. ఎవరైనా వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదును గుర్తించి…
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్సభ ఎన్నికల ప్రచార గీతాన్ని సవరించిన తర్వాత ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కార్యాలయం ఆమోదించింది. పాటను రచించి, వాయిస్ ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే పాట ఆమోదం పొందినట్లు ధృవీకరించారు.
పొలిటికల్ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రతిపాదిత లబ్ధిదారుల పథకాల కోసం వివిధ సర్వేల ముసుగులో ఓటర్ల వివరాలను కోరడం ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి పద్ధతి అని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
BJP: రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని బీజేపీ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు తెలిపిన ఈసీ.. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది.
Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు కష్టమయ్యేలా కనిపించడంతో జమ్మూ- కశ్మీర్లోని అనంత్నాగ్- రాజౌరీ లోక్సభ స్థానంలో ఎలక్షన్స్ ను మే 25వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం నాడు నిర్ణయించింది.
జనసేన పార్టీకి కామన్ సింబల్గా గ్లాసు గుర్తునే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై ఆదేశాలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా.