ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.. పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డికి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది ఎన్నికల కమిషన్.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ప్రత్యర్థులపై గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టాలనే లక్ష్యంతో అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత శుక్రవారమే జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు
ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ - టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.