ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటుచే సిన స్ట్రాంగ్ రూములను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది.. జీరో వైలెన్స్ గా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు.
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అచ్చంపేట మండలం వేల్పూర్ లో మరోసారి వివాదం చెలరేగుతుంది. నిన్న ( సోమవారం ) పోలింగ్ బూత్ దగ్గర గ్రామంలోని రెండు వర్గాల వారికి గొడవ జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. 26వ పోలింగ్ బూత్ లో తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణతో వివాదం చేలరేగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈసీ లెక్కల ప్రకారం 78.36 శాతం మేర పోలింగ్ అయినట్లు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో అనేక దుష్ప్రచారాలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రచార పర్వం ముగిసింది. ఇక 13న జరిగే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కూడా జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను 13 నియోజక వర్గాల్లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు…
ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 13న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు,…