తెలంగాణలో రైతు భరోసా నిధులను ఈసీ నిలిపివేసింది. సోమవారం నిధుల డిపాజిట్‌కు అధికారం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. మే 13న లోక్‌సభ ఎన్నికల తర్వాతే రైతుల భరోసా, పంటనష్టం చెల్లింపులకు సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసాకు నిధులు ఇచ్చి ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. ఈ మేరకు నిధుల జమ ఆలస్యం కానున్నట్లు ఈసీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
మే 13న ఎన్నికలు పూర్తయిన తర్వాత బకాయి ఉన్న రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల 9న రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగ సభల్లో ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎన్.వేణుకుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎలక్షన్ కమిషన్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్నికల తర్వాతే రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది.
Also Read: Duck Outs: క్రికెట్లో ఎన్ని రకాల ‘డక్ ఔట్స్’ ఉన్నాయో తెలుసా.. వివరాలు ఇలా..
ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు భరోసా కింద ప్రభుత్వం రూ. 2,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేయనుంది. అకాల వర్షాలు, అనావృష్టి కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసి ఆమోదం కోరింది. ఇందుకు గాను ఈసీ సోమవారం సాయంత్రం అనుమతి ఇచ్చింది. దీంతో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఎదురుదెబ్బ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, అందుకే నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని ఈసీ పేర్కొంది. రైతు భరోసా నిధుల విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మే 9లోగా రైతు భరోసా నిధులు విడుదల చేయకుంటే ముక్కు నేలకు రాస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసారు.