దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత శుక్రవారమే జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల రెండో ఘట్టం దగ్గర పడింది. ఏప్రిల్ 26నే రెండో విడత పోలింగ్ జరగనుంది. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక విమర్శలు-ప్రతి విమర్శలతో నాయకులు ధ్వజమెత్తుకుంటున్నారు
ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ - టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
Tamil Nadu : ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల పై ఈసీకి ఫిర్యాదు నమోదైంది. ఏప్రిల్ 19న ఓటింగ్ రోజున డెలివరీ బాయ్‌లను నియమించుకున్నందుకు ఎన్నికల కమిషనర్ సమాధానాలు కోరారు.
భారతదేశం వ్యాప్తంగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావిడి కోలాహాలంగా జరుగుతోంది. ఇప్పటికే దేశంలోని అన్ని పార్టీలు జరగబోయే ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలను మమేకం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నాడు ఎన్నికల ప్రచారం కు చెక్ పడింది. శుక్రవారంనాడు జరగబోయే…
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రేపట్నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలు కానున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే... ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.