మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దంమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు.
ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో పోలింగ్ వేళలను ఈసీ ప్రకటించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అరకు, పద్రో, రంపకుడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సరూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. క్యూలో…
ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో…
వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే దీనిపై స్పందించిన ఈసీ.. పోలింగ్ తేదీ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టుకు తెలిపింది.
INDIA Alliance: లోక్‌సభ ఎన్నికల ప్రతి దశ ముగిసిన తర్వాత పూర్తి ఓటింగ్ శాతం గణాంకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసేందుకు ప్రతిపక్ష ఇండియా అలయన్స్ నాయకులు గురువారం ఎన్నికల కమిషన్ను కలవనున్నారు.