ఎన్నికల ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించుకున్నందుకు హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. బీజేపీ హర్యానా అనే హ్యాండిల్ ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
దేశ వ్యాప్తంగా మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి గెలుపు షాక్ ఇచ్చింది.. మొదట నమ్మలేకపోయాం అన్నారు. అయతే ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది. భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్న ఆయన.. ఎన్నికలయ్యాక ఏపీలో 68.12 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఈసీ…
హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ ను నిలిపేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించింది. సుదీర్ఘ వారంతపు సెలవుల( లాంగ్ వీకెండ్) కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
జమ్మూకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Election commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 1వ తేదీ నాటికి ఓటర్లుగా అర్హులయ్యే వారి పేర్లను జాబితాలో చేర్చేలా సవరణ ప్రక్రియ చేపట్టనున్న ఈసీ.. 2025 జనవరి 1వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటన కోసం ప్రక్రియను ప్రారంభించేలా ప్రకటన విడుదల చేసింది.
Elections for Rajya Sabha Posts: రాజ్యసభలో ఖాళీ ఐన స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో.. 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.…
Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
MLC Elections 2024: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోటీకి బలమైన అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.