మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం వాడడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఖండించారు. అభ్యర్థులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల, చట్టాన్ని అమలు చేసే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. READ MORE: CM Chandrababu: ఏలూరు పోలీసులను…
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మృతితో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Srilanka : శ్రీలంకలో నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డింది.
Maharashtra: నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.
Election Commission: ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ సంచలన విషయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను గెలుచుకుని మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి కాంగ్రెస్ 37 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది.
Supreme court: ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.