Congress: ‘‘ఈవీఎంలు హ్యాక్ చేశారు’’..హర్యానా ఓటమిపై కాంగ్రెస్ సంచలనం..
- హర్యానా ఓటమిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణ..
- 20 చోట్ల ఈవీఎంలు హ్యాక్ అయినట్లు ప్రకటన..
- ఈసీకి ఆధారాలు సమర్పించినట్లు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: హర్యానా ఓటమి కాంగ్రెస్ ఆశల్ని ఆవిరి చేసింది. ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేసిన హర్యానాలో బీజేపీ చేతిలో దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, దీనికి విరుద్ధంగా షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Delhi: మరోసారి ఆప్ వర్సెస్ కేంద్రం.. సీఎం అతిషి ఇంట్లో వస్తువుల తొలగింపుపై వాగ్యుద్ధం
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
తాజాగా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. ఎన్నికల కమీషన్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ ఆరోపించింది. 20 స్థానాల్లో హ్యాకింగ్ జరిగిందని, అందులో ఏడు స్థానాలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలని సమర్పించినట్లు పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. మిగతా 13 స్థానాలకు సంబంధించి రీసెర్చ్ పత్రాలను 48 గంటల్లో సమర్పిస్తామని తెలిపారు. పరిశోధనలు పూర్తయ్యే వరకు అన్ని ఈవీళఎంలకు సీటు వేయాలని, భద్రపరచాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు.
కర్నాల్, దబ్వాలి, రేవారీ, పానిపట్ సిటీ, హోడల్, కల్కా మరియు నార్నాల్‌లలో హ్యాకింగ్‌కు సంబంధించిన ఆధారాలను కాంగ్రెస్ సమర్పించినట్లు ఆయన చెప్పారు. ఫలితాలు తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ చెప్పారని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా అన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఎల్లప్పుడూ గెలుస్తోందని, అయితే ఈవీఎంలు తెరిచిన తర్వాత ఫలితాలు తారుమారు అవుతున్నాయని హుడా ఆరోపించారు.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!