రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఏడు విడుతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్, మథురాపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు సోమవారం ఒక్కో పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య నేడు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో జూన్ 1న ఓటింగ్ నిర్వహించగా.. అ ఫిర్యాదులు రావడంతో మళ్లీ ఇక్కడ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
దేశంలో 7 దశలలో జరిగిన లోక్ సభ ఎన్నికలు-2024తో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. దేశంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ రేపు(మంగళవారం) జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత.. ఇండియా కూటమిలో కలకలం రేగింది. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ప్రతినిధి బృందం ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నిర్వాచన్ సదన్‌కు వెళ్లి ఎన్నికల కమిషన్‌ను కలవనుంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో జారీ చేసిన మోమోలను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని డీజీపీ ఆఫీసుకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు వచ్చీ రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.