ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేదికపై నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కేజ్రీవాల్ అన్నారు. నవంబర్‌లో ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ కన్వీనర్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రతో సహా ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. తీహార్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలు నిర్ణయించే వరకు తాను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబోనని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అయితే ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయనని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ సమయంలో.. మనీష్ సిసోడియా కూడా ఎటువంటి బాధ్యత తీసుకోరని కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా ప్రజల మధ్యకు వెళ్తామని ప్రకటించారు.
READ MORE: SIIMA 2024 : నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
సిసోడియా కూడా ఏ పదవి తీసుకోరు: కేజ్రీవాల్
ప్రజా తీర్పు అనంతరం మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి పదవి చేపడతారని.. తానే స్వయంగా ఈ విషయం తనతో చెప్పినట్లు కేజ్రీవాల్ అన్నారు. సతేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ కూడా త్వరలో బయటకు వస్తారని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు తమ కోసం ప్రార్థించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. తన చిన్న పార్టీ దేశ రాజకీయాలను మార్చేసిందన్నారు. జైలులో ఆలోచించడానికి సమయం దొరికిందని కేజ్రీవాల్ తెలిపారు. తాను జైలు నుంచి ఒకే ఒక్క లేఖ రాశానని.. ఎల్‌జీ సాహెబ్‌కి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాసినట్లు గుర్తు చేశారు. జెండా ఎగురవేసేందుకు అతిషీ జీకి అనుమతి ఉందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.