EC: చిన్నారితో ఎన్నికల ప్రచారం.. బీజేపీకి ఈసీ నోటీసులు
- ఎన్నికల ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించిన బీజేపీ
- నోటీసులు జారీ చేసిన ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించుకున్నందుకు హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. బీజేపీ హర్యానా అనే హ్యాండిల్ ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పిల్లలను ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం నిషేధించిన విషయం విదితమే. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినందకు ఈ మేరకు చర్యలు తీసుకుంది.
READ MORE: JK Floods: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరి పిల్లలతో ప్రవాహంలో కొట్టుకుపోయిన తల్లి
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
కాగా.. దేశంలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ పార్టీలు.. చిన్న పల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని ఆదేశించింది. పార్టీ అభ్యర్థికి సంబంధించిన పోస్టర్లు అంటించటం, కరపత్రాలు పంచటం, ఎన్నికల ర్యాలీల్లో చిన్న పిల్లల చేత నినాదాలు చేయించటం వంటి పనులకు చేయరాదని పేర్కొంది. ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో చిన్న పిల్లలను భాగం చేస్తే సహించబోమని ఈసీ వెల్లడించింది. రాజకీయనేతలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలో చిన్న పిల్లలను ఎత్తుకోవటం, ర్యాలీలో పాల్గొనే ప్రచార వాహనాలపై పిల్లలను ఎక్కించటం, వారికి పార్టీ జెండాలు ఇచ్చి ప్రచారం చేయించటం వంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది. పిల్లలు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఏదైనా రాజకీయ నేత, అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం తమ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈసీ మార్గదర్శకాలను పాట్టించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!