Ranjith Reddy: చేవెళ్ళ ప్రజలకు సంక్షేమం చేయడమే నా లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం పెద్దెముల్ మండలం గొట్లపల్లి, తట్టెపల్లి గ్రామాల్లో ఎంపీ రంజిత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలు టీ.రాంమోహన్ రెడ్డి, బి. మనోహర్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం చేశారు. అయితే.. తొలుత తాండూరులో ఆయన వినూత్నంగా ఎద్దులబండి మీద ప్రచారం చేపట్టారు. అనంతరం పరిగి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… చేవెళ్ళ వైవిధ్యభరితమైందని చెప్పారు. ఎందుకంటే, తమ పార్లమెంట్ ప్రాంతమని.. హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పూవ్వుల నుంచి సాఫ్ట్ వేర్ దాకా ఎగుమతి చేస్తుందని చెప్పారు.
Chandrababu: ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
హైదరాబాద్ మహానగర వంటింట్ల కూరగాయలు, కూరలు తమవేనని… దేవునింట్ల పూవ్వులు తమవేనని… కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ కూడా మనవేనని నొక్కి చెప్పారు. తాను ఎంత అదృష్టవంతున్ని అయితే ఇంత గొప్ప నియోజకవర్గానికి ఎంపీని అవుతానని గుర్తు చేశారు. అయితే.. ఈ అదృష్టం చేవెళ్ళ ప్రజలు ఇచ్చిన అవకాశమని… అదే అదృష్టం ప్రతి చేవెళ్ళ బిడ్డ కళ్ళల్ల చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు. చేవెళ్ళ ప్రజలకు అందుబాటులో లేని నాయకుడితో తనకు ఏమాత్రం పోటీ కాదని రంజిత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థికి చురకులు అంటించారు.
Amitabh: స్థలాన్ని కొన్న అమితాబ్… ఎన్ని కోట్లో తెలుసా?
బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందినట్టు రంజిత్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి, అందుబాటు వంటి నినాదాలతో బరిలో నిలిచానని… ఈసారి పంచసూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్టు వివరించారు. అవి… అభివృద్ధి, అందుబాటు, విద్య, వైద్యం, సంక్షేమం అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచడమే తన జెండా… ఎజెండా అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!