ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గ పరిధిలోని నందిగామ పట్టణంలోని ఆర్ టి ఓ కార్యాలయం రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తనధైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు.
సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వికారాబాద్ నియోజకవర్గంలోని పూడూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీకి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ముందు నిలబడలేకనే..…
ఉంగుటూరు మండలంలోని నందమూరు, మధిరపాడు, చికినాల్, బోకినాల, చాగంటిపాడు, వేంపాడు, తరిగొప్పుల గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల రణరంగంలో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు.
ప్రచారంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అందరూ కూడా టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కొలికపూడి కోరారు.