ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలోని కుంకువారి పాలెం, రామానుజపురం కొమ్మి, కొమ్మి ఎస్సీ కాలనీ, కొమ్మి ఎడబ్ల్యూ కాలనీ సత్యవేలు, ఎస్సీ కాలనీ తదితర గ్రామాలలో శుక్రవారం పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిలు హాజరయ్యారు. పల్లె ప్రజలు కాకర్ల సురేష్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బ్యాండ్ మేళంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ గుర్రంపై సవారి చేస్తూ ప్రజలకు అభివాదం తెలుపుతూ ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని ఆయన కోరారు.
Read Also: Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి.. చిట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. 2018లో యువ నాయకుడు నారా లోకేష్ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రంలో మదర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ మండలంలోని అన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లతో నీటిని సరఫరా చేశారని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అదే తరహాలో మదర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 90 శాతం పూర్తి చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీటిని అందిస్తానన్నారు. గత 40 సంవత్సరాలుగా రెండుసార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చింది.. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మిగిలిన సమయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపొందించిన కలలకు రెక్కలు డాట్ కామ్ లో ఇప్పటికే 70 వేల మంది అప్లికేషన్ చేసుకున్నారన్నారని కాకర్ల సురేష్ వెల్లడించారు.
Read Also: Vellampalli Srinivas: బోండా ఉమాపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఫైర్
ఇక, వరికుంటపాడు మండలం, గణేశ్వర పురం రొంపి దొడ్ల నరసింహపురంతో పాటు పలు గ్రామాలలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అవ్వ తాతల వద్దకు వెళ్లి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. బొట్టు పెట్టి మరి తమ భర్తను గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. కాకర్ల ప్రవీణ ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. ప్రజా సేవకులు కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపిస్తామని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో పాటు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే సంక్షేమం అభివృద్ధితో పాటు పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని కాకర్ల ప్రవీణ తెలిపారు.
అలాగే, ఉదయగిరి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఆయన తమ్ముడు కాకర్ల సునీల్ ప్రచారం నిర్వహించారు. జలదంకి మండల కేంద్రంలో శుక్రవారం నాడు మండల నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జలదంకి పట్టణంలో గడపగడపకు తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ప్రజాసేవకులైన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అదే విధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకర్ల సునీల్ మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని తెలిపారు. దీంతో యువతకు ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ తమ్ముడు కాకర్ల సునీల్ ప్రార్థించారు.
ఇక, సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అలాగే, ఉదయగిరి నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ను గెలిపించాలని ఆయన మరదలు కాకర్ల సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ తెలుగుదేశం మేనిఫెస్టోను ఓటర్లకు వివరిస్తున్నారు. ఉదయగిరి తెలుగుదేశం ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చేందుకే కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా విజయం సాధించాలన్నారు. టీడీపీ ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు నిరుద్యోగ నిర్మూలన కోసం యువతకు ఉపాధి ఉద్యోగ కల్పన, రైతులకు 20 వేల ఆర్థిక సహాయం లాంటి వాటి గురించి ప్రజలకు కాకర్ల సురేఖ తెలిపింది.
Read Also: Actor Kidnap: మిస్సింగ్ కాదు కిడ్నాప్.. సీసీటీవీ ఫుటేజీతో పోలీసులు ట్విస్ట్!
అలాగే, దుత్తలూరు మండలంలోని బండకింద పల్లి గ్రామం మొత్తం మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరింది. దుత్తలూరు మండల కేంద్రంలోని బొందల రఘురామి రెడ్డి వర్గం మూకుమ్మడిగా టీడీపీ తీర్థం పుచ్చుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి సారథ్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో రఘురామి రెడ్డి వర్గం సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ కాకర్ల సురేష్, కంభం విజయరామిరెడ్డిలు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోనికి ఆహ్వానించారు.