ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నందిగామ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు. ఇవాళ ఆయన నందిగామ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ, ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొకసారి తనను గెలిపించమని అభ్యర్థిస్తున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి అంబర్ పేట్ డివిజన్లోని న్యూ పటేల్ నగర్, నరేంద్ర నగర్, చెన్నారెడ్డి నగర్, సి బ్లాక్, రఘునాథ్ నగర్ కాలనీలలో పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏజ్ఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. నేతలు నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
సీఎం జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలందరికి ఆమోదయోగ్యమైనదన్నారు. జగన్ మాటిచ్చాడంటే ఎన్ని ఇబ్బందులెదురైనా ఆ మాటను నెరవేర్చగలిగే సమర్థత కలిగిన నాయకుడన్నారు. గడిచిన ఐదేళ్లలో అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసారన్నారు అన్నా రాంబాబు.
తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కొర్రపాడు, విశదల, మందపాడు, సిరిపురం, వరగాని గ్రామాల్లో పర్యటించారు.